Saturday, November 23, 2024

DC vs RR | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (మంగళవారం) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని.. ఢిల్లీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేటప్లో ప్రారంభంకానుంది.

జట్ల వివారాలు :

రాజస్థాన్ రాయల్స్ :

రోవ్‌మన్ పావెల్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సంజు శాంసన్ (c & wk), శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్.

ఢిల్లీ క్యాపిటల్స్ :

అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్‌:

ఢిల్లీ క్యాపిటల్స్ : లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, కునాల్ సింగ్ రాథోడ్, కుల్దీప్ సేన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్

నెంబ‌ర్ వ‌న్ కోసం ఆర్ ఆర్ ఫైట్

ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత చాలా కాలం నెంబర్ వన్ గా ఉన్న రాజస్థాన్ ఉన్నట్టుండి నెంబర్ 2 కి ప‌డిపోయింది. దీంతో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగనున్న మ్యాచ్ లో గెలిచి మ‌రోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 8 మ్యాచ్ లు గెలిచి 16 పాయింట్లతో టాప్ 2 లో ఉంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లు గెలిచింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్ లు జరిగాయి. ఢిల్లీ 13 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే, రాజస్థాన్ 15 గెలిచింది.

రాజస్థాన్ విషయానికి వస్తే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగులో పటిష్టంగా ఉండటం, అందరూ భీకర ఫామ్ లో ఉండటంతో మ్యాచ్ లను అవలీలగా గెలుస్తున్నారు. ఓపెనర్ గా యశస్విజైశ్వాల్ ఫామ్ అందుకున్నాడు. మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. జాస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్, అందరూ అదరగొడుతున్నారు. ఇక బౌలింగు విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చాహల్, ఆవేశ్ ఖాన్ అందరూ పకడ్బందీగా బౌలింగు చేసి ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే మొదట్లో ఓటమి బాటలో నడిచి, ఇప్పుడే పికప్ అందుకుంది. మరి దాన్ని ముందుకు తీసుకువెళుతుందా? లేక పంజాబ్ లా ఆగిపోతుందో తెలీదు. అయితే ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్ , అభిషేక్ పొరెల్, షయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ అందరూ బాగా ఆడుతున్నారు. బౌలింగు విషయానికి వస్తే ముఖేష్ కుమార్, ఖలీల్, అక్షర్ పటేల్, కులదీప్ అందరూ మంచి ప్లేయర్లే ఉన్నారు. ఈసారి మరి రెండు జట్లు ఎలా ఆడతాయో, ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement