అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో జేయింట్స్తో తలపడిన ఢిల్లీ… 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది.
209 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో టాపార్డర్ అంతా కుప్పకూలింది. నికోలాస్ పూరన్ (27 బంతుల్లో 61), అర్షద్ ఖాన్ ( 33 బంతుల్లో 58) అర్థ సెంచరీలతో చెలరేగారు. అయితే మిగిలిన వారు విఫలమవ్వడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.