విశాఖ వేదికగా సీఎస్కేతో తలపడిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. చెన్నై బౌలర్లపై విరుచుకపడింది. డేవిడ్ వార్నర్ (52), రిషబ్ పంత్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. మరోవైపు ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన పృథ్వీ షా (43) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఇక సీఎస్కే బౌలర్లలో మతీషా పతిరనా మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహమాన్, రవీంద్ర జడేజా చరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 192 పరుగుల టార్గెట్తో చెన్నై జట్టు చేజింగ్కు దిగననుంది.