Friday, November 22, 2024

ఒక్కసారిగా పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి!

దేశంలో ఒక్క‌సాగిగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోతున్నాయి. దీంతో చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్‌ దిగువకు పడిపోయాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 15 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడింది. పైగా గత కొన్ని రోజుల నుంచి చలి ప్రతాపం కొనసాగుతుండటంతో దాని నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటున్నారు.

హైద‌రాబాద్ లో చ‌లి పంజా…
హైద‌రాబాద్‌ నగరంను మరోసారి చలి వణికిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఒక్కసారిగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు పడిపోయాయి. మ‌రికొన్ని రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద‌వ‌నున్న‌ట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర‌మైన చ‌లి ఉండ‌టంతో హైద‌రాబాద్‌ న‌గ‌ర వాసులు ఉదయం బ‌య‌ట‌కు రావాలంటేనే వణికిపోతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం.. తుపాను కార‌ణంగా ఈదురు గాలుల‌తో చ‌లి తీవ్ర‌త మ‌రింత పెరిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 15వ తేదీన అండమాన్‌ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం 20వ వరకు ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా చలి తీవ్రత కూడా మరింత పెరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement