Wednesday, November 20, 2024

బెంగ‌లూరులో డే అండ్ నైట్ టెస్ట్.. వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి..

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. కోహ్లీ వందో టెస్టు ఆడిన మొహాలీ స్టేడియంలో కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు. బెంగళూరు డే/నైట్ టెస్టుకు మాత్రం 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించినట్టు కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) పేర్కొంది. మిగతా 50 శాతం టికెట్లు నేటి నుంచి స్టేడియం వద్ద అందుబాటులో ఉంటాయని కేఎస్‌సీపీ తెలిపింది.

ఈ నేపథ్యంలో వందో టెస్టులో సెంచరీ సాధించలేకపోయిన టీమిండియా మాజీ సారథి ఈ టెస్టులో శతకం నమోదు చేయాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే రెండేళ్ల సెంచరీ దాహం బెంగళూరులో తీరుతుంది. కోహ్లీ చివరిసారి నవంబరు 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడిది కూడా డే/నైట్ టెస్టే కాబట్టి అభిమానులు అతడి నుంచి సెంచరీ ఆశిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement