Wednesday, January 29, 2025

Davos Review – సామాన్యుల‌ను అసామాన్యులుగా చేయ‌డ‌మే ల‌క్ష్యం … చంద్ర‌బాబు

తాడేపల్లి ‍ ‍‍- సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు వెల్ల‌డించారు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు .. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. తాడేప‌ల్లిలోని సిఎం క్యాంప్ కార్యాల‌యంలో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తన దావోస్ పర్యటన వివరాలను షేర్​ చేసుకున్నారు. 1997లోనే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో దావోస్​లో పర్యటించానని చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తంమీద దావోస్​లో పర్యటించాలనే ఆలోచన తనకే వచ్చిందని, భారత్ నుంచి దావోస్​లో పర్యటించిన తొలి సీఎం తానేనని పేర్కొన్నారు.

అప్పటి నుంచి సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లోనూ దావోస్​లో పర్యటించి రాష్ట్రానికి విదేశీ పరిశ్రమలను తీసుకొచ్చానని సీఎం చంద్రబాబు వివరించారు. ఒకప్పుడు ఐటీ గురించి అంతా మాట్లాడుకునే వారని, ఆ సమయంలో తాము హైటెక్ సిటీ నిర్మించామని గుర్తుచేశారు. తొలుత హైటెక్ సిటీని రికార్డు సమయంలో నిర్మించామని, అది పూర్తయ్యాక కంపెనీలను ఆహ్వానించామని వివరించారు. అక్కడ హైటెక్ సిటీతో పాటు సైబర్ సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. అప్పట్లో తాను, అప్పటిక కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ విదేశీ పెట్టుబడుల కోసం ఎంతో కష్టపడ్డామని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

దావోస్ లో…
దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఏఐ.. డీప్ టెక్‌కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు .. దేశానికి మోడల్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు.. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నార‌ని, .. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో భవిష్యత్ లో తెలుగు వారుంటార‌ని పేర్కొన్నారు. సిఐఐ, ఐఎండి సింగపూర్ తో కలిసి, ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.. దీనికి సంబంధించి మేనేజ్ మెంట్ కంపెనీ ఉంటుందన్నారు.. అందరు పారిశ్రామిక వేత్తలు జీఎల్‌సీలో ఉంటారు… సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారు చేయడమే లక్ష్యమ‌ని తెలిపారు చంద్ర‌బాబు.. కార్పోరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో సవాళ్లు ఎదుర్కొనే విధంగా తయారు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.

అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ..

1995లో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇప్పుడు 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) యుగమని చంద్రబాబు చెప్పారు. తొలినాళ్లలో దావోస్ వెళ్లినపుడు హైదరాబాద్ పేరు చెబితే ఎవరికీ తెలిసేది కాదని, అదెక్కడ ఉందని అడిగే పరిస్థితి ఉండేదని అన్నారు. అప్పట్లో హైదరాబాద్​కు సరైన ఎయిర్ పోర్ట్ కూడా లేదన్నారు. అలాంటి సమయంలో హైటెక్ సిటీని 14 నెలల్లోనే నిర్మించి, విదేశీ కంపెనీలను ఆహ్వానించామని వివరించారు. అప్పట్లో ఐటీ, ఇప్పుడు ఏఐ యుగం కొనసాగుతోందన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్​ను కలిశానని, ఆయన కూడా హైదరాబాద్ గురించి ప్రస్తావించారని చెప్పారు. అప్పట్లో తాను హైదరాబాద్​ను ప్రమోట్ చేసిన విషయాన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్​ను ప్రమోట్ చేస్తున్న విషయాన్ని బిల్ గేట్స్ గుర్తుచేశారన్నారు. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్​ను ప్రమోట్ చేసేందుకు అన్ని వేదికలనూ ఉపయోగించుకుంటానని చంద్రబాబు వివరించారు.

భవిష్యత్​లో గ్రీన్ హైడ్రోజనే..

భవిష్యత్​లో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఇండస్ట్రీలు, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​కు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈసారి దావోస్​లో ఎక్కువగా గ్రీన్ ఇండస్ట్రీపైనే చర్చ జరిగిందని గుర్తుచేశారు. దాని తర్వాతి స్థానంలో ఏఐపైన చర్చ జరిగిందన్నారు. పకృతి వ్యవసాయం ముందుముందు ప్రాధాన్యం సంతరించుకుంటుందని, ఏపీలో ఇప్పుడు 10 లక్షల మంది పకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘దావోస్‌ అంటే క్రైటీరియా కాదు. అదొక నెట్ వర్కింగ్. ప్రభుత్వ అధినేతలే కాదు పారిశ్రామికవేత్తలూ చాలామంది వస్తారు. వారితో నెట్ వర్కింగ్ చేసుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే దావోస్ కు వెళ్లాలి.

అన్ని వేదికలపై ఆంధ్రా బ్రాండ్​ ప్రమోట్​ చేశాం..

అక్కడి నెట్ వర్క్ ను, పరిస్థితులను గమనించి ప్రపంచ పోకడను అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్తు ఏ రంగానిది, ఎటువైపు అభివృద్ధి జరుగుతుందనేది ఊహించి అటువైపు రాష్ట్రాన్ని నడిపించాలి’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్​లో తాను, మంత్రి లోకేశ్, అధికారులు.. ఇలా అందరమూ అన్ని వేదికలపై ఏపీని ప్రమోట్ చేశామని పేర్కొన్నారు. జూరిచ్ లో దాదాపు 500 మంది తెలుగు వాళ్లు తనను కలిశారని, అందులో చాలామంది కంపెనీలు పెట్టి విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వంద దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారని, వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువాళ్లు ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement