ప్రస్తుతం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ భారీ రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 45 సెంచరీలతో ఓపెనర్‌గా వార్నర్ అత్యధిక సెంచరీలు నమోదు చేశాడు. అలాగే వన్డేల్లో 20 సెంచరీలు సాధించాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-1తో ముందంజలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఈ సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ రేపటి (జూలై 19) నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా స్వదేశంలో తమ పరువు కాపాడుకోవడానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ను బీట్ చేసి.. డేవిడ్ వార్నర్ భారీ రికార్డు సృష్టించనున్నట్టు తెలుస్తోంది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో సెంచరీ సాధిస్తే.. ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం..వార్నర్ ఓపెనర్‌గా మొత్తం 45 సెంచరీలతో.. భారత జట్టు, ప్రపంచ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో (అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 45 సెంచరీలు) సమంగా ఉన్నాడు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మరో సెంచరీ సాదిస్తే.. టెస్టుల్లో కచ్చితంగా ఈ రికార్డును బ్రేక్ చేసినవాడవుతాడని క్రికెట్ అనలిస్ఉలు చెబుతున్నారు.