ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్లో మాల్దీవ్స్‌లోని ఓ బార్లో కొట్టుకున్నారన్న వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ఈ ఇద్దరూ చాలా రోజులుగా మంచి ఫ్రెండ్స్ అయినా, ఓ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లిందని ఆ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.
అయితే దీనిపై ఈ ఇద్దరు క్రికెటర్లు వివరణ ఇచ్చారు. అవన్నీ ఉత్త పుకార్లే అని, అలాంటిదేమీ జరగలేదని స్లేటర్, వార్నర్ చెప్పారు. ఇదంతా పుకారే. వార్నర్, నేను మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు అని స్లేటర్ స్పష్టం చేశాడు. ఆ తర్వాత వార్నర్ కూడా టెక్ట్స్ మెసేజ్ పంపించాడు. ఎలాంటి డ్రామా జరగలేదు. మీకు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మీకు అక్కడ ఉండి లేదా బలమైన ఆధారం ఉంటేనే ఏదైనా రాయండి. అసలు ఏమీ జరగలేదు అని వార్నర్ అన్నాడు.