Tuesday, November 26, 2024

అత్తకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ కోడలి ప్రకటన

ఓ కోడలు తన అత్త కోసం బాయ్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. దీంతో ఆమె ఏకంగా ఓ వైబ్​సైట్​లో ప్రకటన ఇచ్చేసింది. అమెరికాలోని న్యూయార్క్​కు చెందిన ఓ కోడలు.. తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్​ ఫ్రెండ్​గా అద్దెకు కావాలని క్రెయిగ్స్​లిస్ట్​ అనే క్లాసిఫైడ్స్​ వెబ్​సైట్​లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్​ అయ్యింది.

51 ఏళ్ల అత్తయ్యతో కాస్తా సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తి తోడుగా కావాలట. అందుకోసం 960 డాలర్లు (రూ.72వేలు) ఇస్తానని తెలిపింది. అయితే అతడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్​తో పాటు బాగా డాన్స్​ కూడా వచ్చి ఉండాలని కోడలు షరతు విధించింది. కాగా ఈ ప్రకటనపై నెటిజన్లు చమత్కారంగా స్పందిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: వివాదంలో డైరీ మిల్క్ చాక్లెట్

Advertisement

తాజా వార్తలు

Advertisement