Saturday, January 18, 2025

Delhi | పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఖరారైంది. ఈ నెల జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

రెండు విడతల్లో..

మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా.. ఆ తర్వాత మళ్లీ దాదాపు నెల రోజుల విరామం తర్వాత…. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో దశ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement