Saturday, November 23, 2024

దర్భంగా బ్లాస్ట్ కేసులో మరొకరు అరెస్ట్

సంచలనం సృష్టించిన దర్భంగా బ్లాస్ట్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. కాశ్మీర్‌లో ఇజార్‌ను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. యూపీకి చెందిన అతడు కాశ్మీర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించింది. ఈ కేసులో నిందితులైన మాలిక్ సోదరులతో కలిసి దర్భంగా పేలుడుకు ఇజార్ కుట్ర చేసినట్లు నిర్ధారించగా.. పాక్‌లో ఉన్న ఇక్బాల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేల్చింది. ఇజార్‌ను అరెస్ట్ చేసి పాట్నా హైకోర్టులో హాజరుపరిచి.. కస్టడీకి అనుమతించాలని ఎన్‌ఐఏ పిటిషన్ వేసింది.

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: ట్రాక్టర్ ఎక్కి పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ

Advertisement

తాజా వార్తలు

Advertisement