Tuesday, November 19, 2024

ప్రమాదకరంగా కరెంట్‌ తీగలు..పట్టించుకోని అధికారులు

వికారాబాద్‌ టౌన్‌, (ప్రభ న్యూస్‌) : ప్రమాదకరంగా మారిన విధ్యుత్‌ లైన్‌ అని తెలిసిన పట్టించుకొని విధ్యుత్‌ శాఖాధికారుల కారణంగా ప్రజలు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా వర్షాకాలం ఆరంభం కావటంతో కరెంట్‌ తీగల నుండి చెట్లకు విధ్యుత్‌ సరఫరా సులభంగా పాకుతుంది. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రాజీవ్‌ నగర్‌ సమీపాన గల పెట్రోల్‌ బంక్‌ నుండి బండ బావి దేవాలయం వరకు దాదాపు కిలో మీటరు మేర రోడ్డు పక్కన విధ్యుత్‌ తీగలు చెట్లకు ఆనుకుని ఉన్నాయి.

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విధ్యుత్‌ వైర్ల బారిన మూగ జీవాలు పడితే అవి మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోక ముందే సంబందిత అధికారులు శ్రద్ద వహించి విధ్యుత్‌ వైర్లను సరిచేయాలని స్దానికులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement