Saturday, November 23, 2024

ప్లాస్టిక్‌ జెండాలతో ప్రమాదం..

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్దించిన ఆగస్ట్‌ 15వ తేదీన పంద్రాగస్ట్‌ వేడుకలు నిర్వహస్తోండగా.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపు కుంటున్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం కూడా రెండు వేడుకలను జరుపుకోదు. భారత దేశం విభిన్న సంస్కృతులు, జాతుల సమ్మేళనం. అందుకే రెండు వేడుకలను పండుగగా జరుపుకుంటోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సంద ర్భంగా కేంద్రం ”హర్‌ ఘర్‌ తిరంగా” పేరుతో ఇంటింటికి జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇందులో భాగంగా జెండా నిబంధనలలో కొన్ని మార్పులు చేస్తూ వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలి త ప్రాంతాలకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎక్కడ ప్లాస్టిక్‌ జెండాను ఎగరేయొద్దని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌ 1971 కింద చర్యలు తీసుకుంటామని, అలాగే ప్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా 2002 ప్రకారం నిబంధనలను అతిక్రమిం చొద్దు అని, అలా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం గత ఏడాది హెచ్చరించింది. స్వాతంత్ర, గణ తంత్ర దినోత్సవాల సందర్భంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ జెండాలే దర్శనమిస్తున్నాయి. వేడుకల అనంతరం ఇవి మురికి కాల్వల్లో, రహదారులపై కన్పిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement