Monday, November 25, 2024

క‌రోనా కొత్త రూపాలు – బ్రెజిల్ ఓ గుణ‌పాఠం…

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం…
ప్రజల్ని ప్రేరేపించిన బ్రెజిల్‌ పాలకులు
వైరస్‌ ముప్పును తగ్గించి చూపే ప్రయత్నం
నిర్భయంగా రోడ్లమీదికి వచ్చిన జనం
ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలం
బ్రెజిల్‌ పౌరులకు ప్రాణహానిగా పరిణమించిన కొత్త వేరియన్‌
90 శాతం రోగులతో ఐసీయూలు ఫుల్‌
అదుపు తప్పిన పరిస్థితి
ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తం కావాలని నిపుణుల సూచన

గతేడాదితో పోలిస్తే దేశంలో కోవిడ్‌ ముప్పు చాలా తగ్గింది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటలోకొచ్చింది. ఇప్పటికే రెండో దఫా వ్యాక్సిన్‌ పంపిణీ కూడా మొదలైంది. దీంతో దేశంలో కోవిడ్‌ అంటే జనానికి భయం తగ్గింది. మాస్కుల్ని పక్కన పెట్టేశారు. శానిటైజర్ల వినియోగం మానేశారు. వందలు, వేలాదిమంది గుమిగూడే ప్రదేశాలకు విచ్చలవిడిగా హాజరౌతున్నారు. సినిమాలు, మార్కెట్లు, మాల్స్‌, ప్రార్థనాలయాలకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఈ క్రిమి రూపాంతరం చెందుతోంది. మరింత బలంగా తయారౌతోంది. ఆధునిక ఔషధాలకు కూడా లొంగని తీరులో పుంజుకుంటోంది. రోగనిరోధక శక్తి ఎంతగా ఉన్నా దాడి చేయగలుగుతోంది. ఇప్పుడు బ్రెజిల్‌ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటోంది. అక్కడి ప్రభుత్వం, ప్రజలు చూపిన నిర్లక్ష్యానికి ఇప్పుడు తగిన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోంది. ఇలాంటి దుస్థితి భారత్‌లో ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలని ఉద్బోధిస్తున్నారు…

న్యూఢిల్లీ – అమెరికా తర్వాత బ్రెజిల్‌లోనే కోవిడ్‌ విశ్వ రూపం ప్రదర్శించింది. మిలియన్‌ల సంఖ్య లో అక్కడ కోవిడ్‌ బారిన పడ్డారు. లక్షలాది మంది ఈ కారణంగా మరణించారు. మొత్తం బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జనం బెంబే లెత్తిపోయారు. అయినప్పటికీ ఆ దేశ అధ్య క్షుడు జైల్‌బోల్సోనారో జనాన్ని రెచ్చగొట్టారు. కోవిడ్‌కు మరీ అంతగా భయపడొద్దన్నారు. సాధారణ జనజీవితంలోకి రండంటూ ప్రేరే పించారు. ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే బ్రెజిల్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకుపోయింది. 2.60 లక్షల మంది కోవిడ్‌ కారణంగా చనిపోయారు. అమెరికా తర్వాత కోవిడ్‌ మరణాలు అధికంగా ఉన్న దేశంగా బ్రెజిల్‌ నమోదైంది. రోజూ కొత్తగా 2 వేలకు పైగా మరణాలు జరుగుతున్నాయి. అలాగే కొత్తగా లక్ష మంది రోజూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడు బోల్సోనారో వైరస్‌ వల్ల కలిగే ముప్పును తగ్గించి చూపేందుకు ప్రయత్నించారు. ఇక భయాన్ని ఆపండి.. ఎంతసేపు ఆ రోగం గురించి భయపడుతూ బ్రతుకు తారంటూ ఓ కార్యక్రమంలో ఆయన ప్రజలకు సూచిం చారు. మరణాలకు చింతిస్తున్నాం.. అలాగని తలుపులన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుని ఎంతకాలం గడుపుతారంటూ నిలదీశారు. వాస్తవా నికి అప్పటికే బ్రెజిల్‌ ఆరోగ్య వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లు మహమ్మారి అంతానికి ప్రయత్నిస్తున్నారు. టీకాలు కొని ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తు న్నారు.
ఈ దశలో జనాన్ని రోడ్లమీదకు రమ్మంటూ అధ్యక్షు డిచ్చిన పిలుపు అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. దేశంలోని ప్రఖ్యాత బీచ్‌లు, బార్లు తెరుచుకున్నాయి. రెస్టారెంట్లకు జనం పోటెత్తారు. దీంతో మహమ్మారి తిరిగి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టింది. ఇప్పుడు బ్రెజిల్‌లోని 27 రాష్ట్రాలకు గాను 25రాష్ట్రాల్లోని ఐసీయూ యూ నిట్లు 85శాతానికి పైగా రోగులతో నిండిపోయాయి. మరో నాలుగైదు రోజుల్లో ఐసీయూలలో బెడ్లు దొరికే పరిస్థితి లేదు. బ్రెజిల్‌లో ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరించగలిగే వేరియంట్‌ను కోవిడ్‌-19 అభివృద్ధి చేసింది. ఇది ఆ దేశ మానవళికి ముప్పుగా పరిణమించింది. నిపుణుల సలహాల్ని బోల్సోనోరో పెడచెవిన పెట్టిన ఫలితాన్ని ఇప్పుడు బ్రెజిల్‌ అను భవిస్తోంది. రియోడి జనీరో, రసిలియో, సావోపాలో వంటి నగరాల్లో ఆస్పత్రులు 90శాతం రోగులతో నిండిపోయాయి. పోర్టు అలెగ్రే, కాంపోగ్రాండే నగరాల్లోని బెడ్లు నిండిపోవ డంతో నేలపైనే రోగుల్ని ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశం అనారోగ్యపరంగా ఓవర్‌లోడ్‌ అయిందని, ఆరోగ్య వ్యవస్థల పతనం మొదలైందంటూ బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సామూహిక టీకా, లేదా మహమ్మారి నిర్వ హణలో సమూల మార్పుల కోసం తాము చేసిన ప్రయ త్నాలు మధ్యలోనే నీరుగారి పోయాయని ఇప్పుడు ఆ శాఖ నిపుణులు వాపోయే దుస్థితి నెలకొంది.
సావోపాలో విశ్వవిద్యా లయం, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు బ్రెజిల్‌ వేరియంట్‌ను పరిశీలించాయి. ప్రాథమిక నివేదిక మేరకు పి1 వేరియంట్‌గా దీన్ని గుర్తించాయి. ఇది సాధారణ కోవిడ్‌ కంటే రెండు రెట్లు వేగంగా ఒకరి నుంచి మరొకరికి విస్తరించగలదు. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా తప్పించుకుని శరీరంలోకి చొచ్చుకు పో గలదు. దీని నుంచి రీ ఇన్‌ఫెక్షన్‌ అవకాశం కూడా 60శాతం వరకు ఉంటుందని ఇవి స్పష్టం చేశాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ తరహా వేరియంట్‌ విశ్వరూపం ప్రదర్శి స్తోంది. ఓ విధంగా చెప్పాలంటే బ్రెజిల్‌ ఇప్పుడు కోవిడ్‌ అనే అణు బాంబుపై నిలబడుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ చేసింది. ఈ పరిస్థితిని భారత్‌ పరిగణనలోకి తీసుకోవాలి. కోవిడ్‌ నియంత్రణతో పాటు వ్యాక్సిన్‌ తయారీలోనూ భారత్‌ ప్రపంచా నికి ఆదర్శంగా నిల్చింది. ప్రంపంచంలోని 50 దేశాలకు పైగా భారత్‌ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నాయి.
ఈ వ్యాక్సిన్‌ కోసం మరిన్ని దేశాలు పోటీపడు తున్నాయి. ఈ దశలో ప్రజలు మాత్రం కోవిడ్‌ పట్ల అప్రమత్తత ప్రదర్శిం చడం లేదు. ఇదే కొనసాగితే పరిస్థితి చేయి దాటే ప్రమాదాన్ని నిపుణులు శంకిస్తున్నారు. వేగంగా టీకాలేయడం, కఠినమైన సామాజిక దూర చర్యలతో కూడిన ప్రణాళికల్ని మరికొం తకాలం అమలు చేయాల్సిన అవస రాన్ని వీరు నొక్కి చెబుతున్నారు. సహజంగా వైరస్‌ లను దేశ సరిహద్దులు నియంత్రిం చలేవు. ఇప్పుడు పి1 వేరియంట్‌ ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోయే ప్రమాదం స్పష్టమౌ తోంది. అదృష్టవశాత్తు ఇప్పుడు భారతదేశంలో వినియో గిస్తున్న వ్యాక్సిన్లు పి1 వేరియంట్‌ను కూడా తట్టుకోగలవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వ్యాక్సిన్‌కు పి1ను తట్టుకునే శక్తి తక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడు తున్నారు. కొత్త వేరియంట్‌లకు కూడా వ్యతిరేకంగా పని చేయగలిగే టీకాలు అందుబాటు లోకొచ్చే వరకు జాగ్రత్తలు తప్పవని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement