మొన్నటిదాకా కరోనా వైరస్.. నేడు మంకీపాక్స్ గుబులు మొదలైంది. పలు దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమై కట్టడికీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కొత్త వైరస్ మంకీపాక్స్ ఫ్రాన్స్‌ను వణికిస్తున్నది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది. ఈ వైరస్ భారిన పడిన వారిలో అధిక శాతం పురుషులే ఉన్నారని వైద్య నిపుణులు అంటున్నారు. దాదాపు 22-63 ఏళ్ల వయస్సు గల వారికి సోకుతుందని ఫ్రెంచ్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. ఆ దేశంలో ఒక్క వ్యక్తి మాత్రమే చికిత్స తీసుకుని కోలుకున్నారని తెలిపారు. ఈ వైరస్ భారిన పడకుండా వయోజనులంతా త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే తీవ్రమైన పరినామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్ బారిన పడ్డారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. తమ దేశంలో 21 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అయితే ఈ వ్యాధి సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement