Thursday, November 21, 2024

Danger Bells – అంటార్కిటికాలో రెండుగా చీలిన మంచుకొండ

అంటార్కిటికాలో దాదాపు 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారీ మంచుకొండకు పగళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. ఢిల్లీ నగర వైశాల్యంతో పోల్చితే నాలుగు రెట్లు ఉండే ఈ మంచుకొండను సైంటిస్టులు ఏ-83గా పేర్కొంటున్నారు. మే 20న జ‌రిగిన ఈ ఘటనకు సంబంధించి ‘కకోపర్నికస్‌ సెంటినల్‌-1’ శాటిలైట్‌ ఫొటోలు విడుదల చేసింది. త్రిభుజాకారంలో ఉన్న ఏ-83 మంచుకొండ మే 22నాటికి పూర్తిగా చీలిపోయినట్టు శాటిలైట్‌ విడుదల చేసిన రాడార్ ఇమేజెస్ స్ప‌ష్టం చేస్తున్నాయి. అంటార్కిటికాలోని ఈ ప్రాంతంలో భారీ మంచు కొండలకు పగుళ్లు రావటం నాలుగేండ్లలో ఇది మూడోసారి. ‘మెక్‌డొనాల్డ్‌ ఐస్‌ రంపెల్స్‌’గా పిలుస్తున్న ప్రాంతంలో మంచు కరగటమే ఈ పరిణామానికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటార్కిటికాలో వస్తున్న వాతావరణ మార్పులపై ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement