Tuesday, November 26, 2024

స్కూల్ లో కరోనా… ఊర్లో దండోరా !!

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అందులో ఎక్కువగా స్టూడెంట్స్ ఉండటం గమనార్హం. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో 163 మంది విద్యార్థులు కరోనా బారిన తాజాగా విజయనగరం జిల్లాలో ఏడుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. పాఠశాలలో 55 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా,వారిలో 28 మంది విద్యార్థుల కరోనా పరీక్షలకు సంబంధించి ఫలితాలువెలువడ్డాయి.

మిగతా వారి ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.అయితే విద్యార్థులకు ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల వాళ్ళని హోమ్ క్వారంటైన్ కు తరలించడం జరిగిందని వైద్యులు,విద్యా శాఖాధికారులు తెలిపారు. విద్యార్థులందరూ నిడగల్లు గ్రామానికి చెందినవారేనని వివరించారు. 1 నుండి 5వ తరగతి చదువుతున్న10 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పాఠశాలలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ..నిడగల్లు గ్రామంలో దండోరా వేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement