ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఓ దాడి కేసులో శిక్ష విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 23కి వాయిదా వేసింది. ఇక ఎస్.సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసి, బెదిరించిన అభియోగాలపై 2013లో దానంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 7న విచారణ జరిపిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు దానంను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది.
ఈ తీర్పును నాగేందర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ జి.శ్రీదేవి దానంపై విధించిన ఆరు నెలల జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బెయిలుకు సంబంధించి కింది కోర్టు విధించిన షరతులే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి :కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్వే: ఈటల గెలుపు ఖాయమట..