ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రాలో అర్ధరాత్రి 12:45 గంటలకు దానా తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావం తో. ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. అలాగే భారీ వర్షం కురుస్తోంది.. ప్రస్తుతం ఒడిశా, బెంగాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి..
దానా తుపాను దెబ్బకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. బలమైన గాలుల కారణంగా హాగింగ్లు విరిగిపోయాయి. తీరం దాటడం తో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్లో దానా తుపానును ఎదుర్కొనేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం బృందాలు మోహరించాయి. ముందుజాగ్రత్తగా ఒడిశాలోని 14 జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించారు. పశ్చిమ బెంగాల్లో 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాను కారణంగా బెంగాల్, ఒడిశాలో 300 విమానాలు, 552 రైళ్లు రద్దు చేశారు.ఏపీ, యానాం, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ తుపాను ప్రభావంపై పశ్చిమ బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తూర్పు తెలంగాణ, ఉత్తరాధ్రలో తేలికపాటి నుంచి ఈమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. దాని ప్రభావం ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపించనుంది. శనివారం మాత్రం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది.