జోగిపేట, నవంబర్30 (ప్రభన్యూస్): మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత, ఆందోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం పోలింగ్ జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 70సీట్లు రాబోతున్నాయని దామోదర్ రాజనర్సింహ అన్నారు. జోగిపేట మున్సిపల్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూతులో కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న విలేకరులతో ఆయన మాట్లాడారు. దామోదర్ తో పాటు ఆయన సతీమణి పద్మిని, కూతురు త్రిష ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్..
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్..
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ అందరితో పాటు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదాశివపేటలోని రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలలోని 187 బూత్ లో కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన మన హక్కు అన్నారు. ఓటు అనేది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన పాలనను ఎన్నుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 11గంటల వరకు పోలింగ్ వివరాలు..
సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం 21.99 నమోదైంది.
సిద్ధిపేట జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ. జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ పోలింగ్ శాతం.
- సిద్ధిపేట నియోజకవర్గం: 30.%
- దుబ్బాక నియోజకవర్గం: 29.12%
- హుస్నాబాద్ నియోజకవర్గం: 26.98%
- గజ్వేల్ నియోజకవర్గం: 24.98%
- మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాల్లో 11 గంటల వరకు జరిగిన ఓటింగ్ శాతం
30.11%
సంగారెడ్డి జిల్లా.. పటాన్ చెరు నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం 16.17 గా నమోదైంది.
వెల్దుర్తి మెదక్ జిల్లా …నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తన స్వగ్రామమైన మాసాయిపేటలో భార్య శైలజా రెడ్డి తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీపీ దంపతులు
గుమ్మడిదల మండల ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు బొంతపల్లీ గ్రామంలోనీ పోలింగ్ బుత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. మండల ప్రజలందరూ.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటు హక్కు సంపాదించుకున్న యువత అభివృద్ధి తమ ఆశయ సాధనాలకు ఉపయోగపడే పార్టీకే ఓటు వేసుకుని గెలిపించుకోవాలని సూచించారు.
సిద్ధిపేట జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ.
జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ శాతం.
- సిద్ధిపేట నియోజకవర్గం: 44.85%
- దుబ్బాక నియోజకవర్గం: 48.27%
- హుస్నాబాద్ నియోజకవర్గం: 42.73%
- గజ్వేల్ నియోజకవర్గం: 42.54%
ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి అభ్యర్థి పులిమామిడి రాజు , మమత….
సదాశివపేట ప్రభా న్యూస్ సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి పూలిమామిడి రాజు ఆయన సతీమణి మమత గురువారం నాడు స్థానిక రవీంద్ర మాడల్ పాఠశాలలో ఓటు ఈ సందర్భంగా ఆయనహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని నన్ను ఆశీర్వదించి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు వందనాలు తెలియజేశారు