ప్రభన్యూస్ : కోట్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) స్తంభాలకు వేలాడుతూ కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఇవి ఇలాగే ఉన్నా ఇటు అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల పెద్దేముల్లో జరిగిన హత్య సంఘటనలో సీసీ ఫుటేజీని ఆధారంగా తీసుకున్న అధికారులకు కోట్పల్లి మండల కేం ద్రంలో వాటిని బాగు చేయించాలన్న ఆలోచనరాక పోవటం దురదృష్టకరం.
కోట్పల్లి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్లో సీసీ కెమెరాలను పట్టించుకున్న నాథుడే లేడు. మండల కేంద్రానికి ప్రతి రోజూ వందలాది మంది వివిధ పనుల నిమిత్తం రాక పోకలు సాగిస్తుంటారు. క్రైం విషయంలో ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడుతున్న నేపథ్యంలో అధికారులు, స్పందించి సీసీ కెమెరాలను బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..