Saturday, November 23, 2024

దెబ్బతిన్న రహదారులు.. మరమ్మతులకు రూ.38.45 కోట్లు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులపై రాష్ట్ర రహదారుల విభాగం దృష్టిసారించింది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రహరాదులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కొన్ని రహదారులు పూర్తిగా దెబ్బతింటే, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 515 చోట్ల రహదారులు దెబ్బతిన్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారు. వీటిలో 217 చోట్ల రహదారులు తెగిపోగా అక్కడ ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.

ఈమేరకు వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించడంతో రహదారుల శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంగళవారం వరకు 68 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్‌ పునరుద్ధరించారు. 515 చోట్ల దెబ్బతిన్న రహదారుల పనులు పునరుద్ధరణ కోసం తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.38.45 కోట్లు ఖర్చు అవుతోందని అధికారులు అంచనా వేశారు. రోడ్ల నిర్వహణకు కేటాయించిన నిధుల నుంచి వీటిని ఖర్చు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనులు చేపట్టారు. మరో వారం రోజుల్లో ట్రాఫిక్‌ పునరుద్ధరణ పనులు పూర్తికానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement