డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రతియేటా జాతీయ అవార్డులు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… దేశంలోని వివిధ స్థాయిల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రతియేటా అంబేద్కర్ జయంతి రోజున అందజేస్తామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వపరంగా రూ.51కోట్ల ను ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ డిపాజిట్ ద్వారా ఏటా సుమారు రూ.3కోట్ల వడ్డీ వస్తుందని, ఆ సొమ్మును అవార్డు విజేతలకు, కార్యక్రమ నిర్వహణకు ఖర్చు చేస్తామని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతియేటా దేశవ్యాప్తంగా ఉన్న దళితులకు ఏడాది 25లక్షల మందికి దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలు అందజేస్తామని సభాముఖంగా ప్రకటించారు.