Friday, November 22, 2024

ఆర్థికాభివృద్ధే కోస‌మే దళితబంధు.. దశలవారీగా ఆర్థిక సాయం : మంత్రి త‌ల‌సాని

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌ పల్లిలో జరిగిన దళిత బంధు కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 మంది లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలకు అనుగుణంగా దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. దళితుల అభివృద్ధే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని చేపట్టామని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క లబ్ధిదారుడికి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.

దళితబంధు పథకం ద్వారా అంజేసిన వాహనాలను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే లబ్ధిదారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికి దళలవారీగా దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు తీసుకురావడం తెలియని బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి బీజేపీ కార్పోరేటర్లను ఢిల్లిdకి పిలిపించి ఒట్టి చేతులతో పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాఅభివృద్ధికి కేంద్రం నిధులను మంజూరు చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగింది..

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్‌ నియోజకవర్గం తూప్రాన్‌కు చెందిన మత్స్యకారులు మంత్రి తలసానికి కొర్రమీను చేపలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మత్స్యకారుల ఆదాయం భారీగా పెరిగిందని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement