Tuesday, November 26, 2024

దళిత బంధు పథకం అమలు కోసం మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ పథకాన్ని తొలుత హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ తలపెట్టినా.. కోర్టు కేసుల నేపథ్యంలో దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించి ఈ పథకం అమలును పర్యవేక్షించనున్నట్టు ప్రకటించింది.

ప్రభుత్వం నిర్ధేశించిన కమిటీలే దళిత బంధు పథకం అమలులో కీలకంగా వ్యవహరించనున్నాయి. పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం, డేటాబేస్‌లో అర్హత కలిగిన కుటుంబాల పేర్లు నమోదు చేయడం, జిల్లా కలెక్టర్‌ నుంచి మంజూరు పత్రాల పంపిణీ, లబ్ధిదారులకు శిక్షణ, అవసరమైన వనరుల కూర్పు, సలహాలు, సూచనలివ్వడం, క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన ఐడీ కార్డుల జారీ, యూనిట్ల పనితీరు పరిశీలన, ఇన్సూరెన్స్‌ కవరేజీ తదితర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. మండల, గ్రామ కమిటీలు లబ్ధిదారులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వారితో చర్చించి.. సమస్యలేమైనా ఉంటే గుర్తించడం, వాటికి పరిష్కారం చూపడం వంటి చర్యలు తీసుకుంటాయి. ఈ సమావేశాలు, చర్చల నివేదికలను డేటాబేస్‌లోకి అప్‌లోడ్‌ చేస్తాయి.

దళిత బంధు పథకం మార్గదర్శకాలు:

✪ రూ.10 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ
✪ సొమ్ము తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనిలేదు
✪ పథకం అమలుకు జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో కమిటీలు
✪ లబ్ధిదారులు పెట్టుకునే యూనిట్లపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ
✪ ఎస్సీల రక్షణ కోసం జిల్లాస్థాయిలో దళిత రక్షణ నిధి ఏర్పాటు (మంజూరైన రూ.10 లక్షల్లో రూ.10వేలు+ SC కార్పోరేషన్ నుంచి రూ.10వేలు+ ప్రతిఏటా లబ్ధిదారు రూ.1000 జమ చేయాలి).

Advertisement

తాజా వార్తలు

Advertisement