దళితులు ఆర్థికంగా, అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివారులో దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్ మిల్ ని మంత్రి కే.తారక రామారావు ప్రారంభించారు. దళిత బంధు లబ్ధిదారులను రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళిత సాధికారతకు దళిత బంధు ఎంతో దోహదం చేస్తుందన్నారు. రైస్ మిల్ యూనిట్ ను స్థాపించాలను కోవడం గొప్ప నిర్ణయం అన్నారు. యూనిట్ చాలా గొప్పగా వచ్చిందని, రైస్ మిల్ యూనిట్ సక్సెస్ పుల్ గా నడవాలని ఆకాక్షించారు. మిగతా లబ్ధిదారులకు ఇది ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్రం మొత్తానికి రైస్ మిల్ యూనిట్ ఆదర్శం కావాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement