బౌద్ధమత గురువు 87వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యం జీవించాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు. ఈరోజు ముందుగా ఫోన్‌లో పవిత్రహృదయులైన దలైలామాకు 87వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
దలైలామా జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక నాయకుడు టిబెటన్ సంస్కృతిని కాపాడారని, సమస్యల పరిష్కారానికి అహింస మార్గంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తో పాటు అనేక మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హర్దీప్ సింగ్ పూరీ.. దలైలామాను భారతదేశానికి చిరకాల మిత్రుడు..కరుణకు బోధిసత్వ” అని అభివర్ణించారు. ప్రపంచ శాంతి, అహింస కోసం అతని తపన మానవాళికి ప్రేరణ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.