Friday, November 22, 2024

బెయిల్‌, బదిలీ పిటిషన్లపై ఇక ప్రతిరోజూ విచారణ.. పెండింగ్‌ పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం

కీలకమైన పెండింగ్‌ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగానే, బెయిల్‌, బదిలీ పిటిషన్లను కూడా వేగవంతంగా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం సీజే డీవై చంద్రచూడ్‌ ఇవ్వాల (శుక్రవారం) కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న బెయిల్‌ పిటిషన్ల విచారణను వేగవంతం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంలో పనిచేస్తున్న13 బెంచ్‌లు, ప్రతిరోజు కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే, కనీసంగా 10 బెయిల్‌, 10 బదిలీ పిటిషన్లను విచారించాలని సూచించారు. క్రిస్మస్‌ నాటికి ఈ విభాగాల్లోపెండింగ్‌ పిటిషన్ల విచారణ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అందరు న్యాయమూర్తులతో సమావేశమై దీనిపై చర్చించారు. అనంతరం కీలక ప్రకటన చేశారు.

బదిలీ పిటిషన్లలో అత్యధికం కుటుంబ, వివాహ బంధానికి చెందిన వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో లిటిగెంట్లు సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కేసును బదిలీ చేయాలని కోరుతుంటారు. ఈ కేసుల్లో న్యాయ సంబంధమైన చిక్కులు పెద్దగా ఉండవు. కానీ, సుప్రీం కోర్టులో పెండింగ్‌ పడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో సీజేఐ మాట్లాడుతూ, 3000 ట్రాన్స్‌ఫర్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 13 బెంచ్‌లలో ప్రతిరోజు 10 కేసులను విచారిస్తే వారానికి 650 పిటిషన్లు క్లియర్‌ చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఐదు వారాల్లో పెండింగ్‌ పిటిషన్లు పూర్తవుతాయి. ఇందుకు అందరు న్యాయమూర్తులు సహకరించాలని అని చంద్రచూడ్‌ కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement