తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘యాస్’గా నామకరణం చేశారు. ఇది పారాదీప్‌కు 540 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా 48 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారనుంది. ఈనెల 26న సాయంత్రం పారాదీప్, సాగర్ దీవుల మధ్యలో తీరం దాటనుంది. ఈ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
మరోవైపు నాలుగు రాష్ట్రాలపై తుపాను ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. ప్రభావం అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, బంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను తాజా పరిస్థితి, సహాయ చర్యలపై సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో పాల్గొన్నారు.