Sunday, December 1, 2024

Cyclone Fengal – తమిళనాడు, పుదుచ్చేరి ఫెంగల్ తుపాన్ విలయం

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాన్ . ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద గత అర్ధ రాత్రి తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తీరం వెంబడి 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.. భారీ వర్షాలతో చెన్నై జలసంద్రంగా మారింది.. చెన్నైతో పాటు 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.. . చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ బీభత్సంతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. వరదల ధాటికి రహదారులు చెరువులుగా మారాయి. వరదనీటిలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తుఫాన్‌ భయంతో… ఫ్లై ఓవర్లపై కార్లను పార్కింగ్‌ చేశారు. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు

తమిళనాడు, పుదుచ్చేరిపై తుపాన్ విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి.

గడిచిన 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల నుంచి 27 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగరవ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారుల అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

- Advertisement -

బలమైన గాలులు వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కరెంటు షాక్‌తో ముగ్గురు మృతి

కరెంటు షాక్‌తో ముగ్గురు మరణించారు. ఇక 14 గంటల తర్వాత చైన్నై విమానాశ్రయం తెరుచుకున్నది. ఎయిర్‌పోర్టులోకి నీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. పలు విమానాలను రద్దుచేశారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఎయిర్‌పోర్టులో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement