Friday, November 22, 2024

Cyclone Biperjoy – గుజరాత్‌ తీరాన్ని తాకిన బిపర్‌జాయ్‌…. 120 కిమీ వేగంతో గాలులు, కుంభవృష్టి

అహ్మదాబాద్ – బిపర్‌జాయ్‌ తుఫాను గుజరాత్‌ తీరాన్ని తాకింది. కచ్‌ తీర ప్రాంతంలోని కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో తుఫాన్‌ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) వెల్లడించింది.దీని ప్రభావంతో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను తీరం దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని ఐఎండీ వెల్లడించింది. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని.. తీరం దాటే సమయానికి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీని కారణంగా కచ్‌, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, మోర్బీ, జునాగఢ్‌, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది

.

తుఫాను ప్రభావంతో అరేబియా సముద్రంలో అల్లకల్లోలం ఏర్పడింది. ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బి తీర ప్రాంతాల్లో 6 మీటర్ల మేర రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు కూడా చేరిందని తెలిపింది. తుఫాను తీవ్రత కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టి దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. తుఫాను హెచ్చరికలతో దేవభూమి ద్వారకలోని ద్వారకాధీశ్‌ ఆలయాన్ని మూసివేశారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులను తాత్కాలికంగా మూసివేశారు

http://Exclusive Biperjoy Tsunami – బిపర్ జాయ్ విలయం … వీడియోలు

Advertisement

తాజా వార్తలు

Advertisement