Saturday, November 23, 2024

Cyclone Biparjoy – పాక్ తీరాన్ని తాకిన బిపర్‌జోయ్ తుపాన్

ఇస్లామాబాద్ – బిపర్‌జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు.. తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని సురక్షితప్రాంతాలకు తరలించామని పాక్ మంత్రి చెప్పారు.

తుపాను వల్ల తట్టా, సుజావాల్, బాడిన్, థార్పార్కర్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పాక్ వాతావరణ మంత్రి తెలిపారు.తుఫాను కారణంగా పాకిస్తాన్‌లో చిన్న విమానాల రాకపోకలను నిలిపివేయవలసిందిగా అధికారులను ఆదేశించామని ఆమె అన్నారు.తుపాన్ ప్రభావం వల్ల గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.తుపాన్ ప్రభావం వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు కరాచీ తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయని మంత్రి షెర్రీ రెహ్మాన్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement