హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పె సోలార్ ప్యానెళ్లతో కూడిన సైక్లింగ్ ట్రాక్ నిర్మితమవనుంది. దక్షిణ కొరియాలోని ఓ రోడ్డు ఆదర్శంగా ఓఆర్ఆర్ 21 కిలోమీటర్ల కొత్త రోడ్డుపై ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ శుక్రవారం ట్విట్టర్లో ఆదేశించారు. వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలుపుతూ అర్వింద్‌కుమార్ ట్విట్టర్లో సమాధానమిచ్చారు. దక్షిణ కొరియాలోని ఓ రోడ్డుపై నిర్మించిన సోలార్ ప్యానెళ్ల టాప్‌తో కూడిన సైక్లింగ్ ట్రాక్‌కు సంబంధించిన వీడియోను ఎరిక్ సోల్హెమ్ అనే విదేశీయుడు పోస్టుచేయగా ఇది కేటీఆర్‌ను ఎంతగానో ఆకర్షించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..