Wednesday, November 20, 2024

ఓఆర్‌ఆర్‌పై సోలార్‌ ప్యానెళ్ల సైక్లింగ్‌ ట్రాక్‌.. దక్షిణ కొరియా ఆదర్శంగా ప్రాజెక్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పె సోలార్‌ ప్యానెళ్లతో కూడిన సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మితమవనుంది. దక్షిణ కొరియాలోని ఓ రోడ్డు ఆదర్శంగా ఓఆర్‌ఆర్‌ 21 కిలోమీటర్ల కొత్త రోడ్డుపై ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శుక్రవారం ట్విట్టర్‌లో ఆదేశించారు. వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలుపుతూ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు. దక్షిణ కొరియాలోని ఓ రోడ్డుపై నిర్మించిన సోలార్‌ ప్యానెళ్ల టాప్‌తో కూడిన సైక్లింగ్‌ ట్రాక్‌కు సంబంధించిన వీడియోను ఎరిక్‌ సోల్హెమ్‌ అనే విదేశీయుడు పోస్టుచేయగా ఇది కేటీఆర్‌ను ఎంతగానో ఆకర్షించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement