- సాధారణ నేరాల తగ్గి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి
- ఈ మార్చి లోపు లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం
- నేర నియంత్రణలో అధునిక టెక్నాలజీని వాడతాం
- నక్సల్స్ సరిహద్దులు దాటి రాకుండా నిఘా ఉంచాం
- శ్రీకాకుళంలో మీడియాతో ఎపి డిజిపి ద్వారకా తిరుమలరావు వెల్లడి.
శ్రీకాకుళం – ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని. ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నామన్నారు.. ఇక రాష్ట్రంలో మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. మొదటి ప్రయారిటీలో గంజాయిని అరికట్టామని అంటూ .. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో గంజాయి రహితంగా చేసేకార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సంకల్ప కార్యక్రమం ద్వారా యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం.. చెడు అలవాట్లకు బానిస కాకుండా చూస్తున్నాం అన్నారు..
ఇక, మిగిలిన అన్ని క్రైమ్‌లు తగ్గాయి.. కానీ, సైబర్ క్రైమ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డీజీపీ.. సైబర్ క్రైమ్ పై ప్రజలలో అవగాహన తీసుకువస్తున్నాం అని వెల్లడించారు.. మరోవైపు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని స్పష్టం చేశారు.. అలాంటి కాల్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.. నిపుణుల సహకారంతో సైబర్ పోలిస్ స్టేషన్లు జిల్లాకు ఒకచోట ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, మైనర్లపైనా అత్యాచారాలు జరుగుతున్నాయిని, ఇది సమాజంకు ఇది సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు.. మావోయిస్టుల కదలిలకపై నిఘా ఉందని అంటూ ఏవోబీని సెల్టర్ జోన్ గా వాడుకోవాలనుకుంటే అది పోరపోటే అవుతుందని మావోయిస్ట్ లను ఆయన హెచ్చరించారు.