హైదరాబాద్: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా జూలై నెలలో 453 మంది పిల్లలను రక్షించినట్లు సైబరాబాద్ పోలీస్ చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం తెలియజేసింది. తాము రక్షించిన వారిలో 383 మంది బాలురు, 70 మంది బాలికలు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 116 మంది పిల్లలను తమ తల్లిదండ్రులకు అప్పజెప్పగా.. 337 మందిని పిల్లల సంరక్షణాలయానికి తరలించారు.
ఈ పిల్లలందరూ హైదరాబాద్ నగరంలో చైల్డ్ లేబర్‌గా, బెగ్గింగ్ చిల్డ్రన్‌గా, రోడ్డు వెంబడి చెత్త సేకరించే వారిగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. చైల్డ్ లేబర్‌ను ప్రోత్సహించిన 205 మందిపై కేసులు నమోదు చేశామని వారు చెప్పారు. నగరంలో ఇలాంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఈ వార్త కూడా చదవండి: బిర్యానీలో బీర్ సీసా ముక్కలు.. హోటల్‌కు రూ.12వేలు జరిమానా