Friday, November 22, 2024

డీజీపీనీ వదలని సైబర్‌ కేటుగాళ్లు.. మహేందర్​రెడ్డి ఫొటోతో డీపీ పెట్టి వసూళ్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇన్నాళ్ళూ అమాయకులను మోసం చేసిన కేటుగాళ్ళు, కొంత కాలంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అందినంత దోచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీని పెట్టిన సైబర్‌ నేరస్థులు పలువురు పోలీసు అధికారులతో పాటు ఇతరులకు సందేశాలు పంపించారు. స్వచ్చంద సంస్థ పేరుతో సందేశాలు పంపిన నేరగాళ్ళు ఆ లింక్‌ను తెరచి వివరాలను నమోదు చేయాలని కోరారు. విషయం తెలిసి అప్రమత్తమైన డీజీపీ అది తన నంబర్‌ కాదని ఎవరూ స్పందించ వద్దని కోరారు. సైబర్‌ నేరగాళ్ళు ఖాతాదారుల రహస్య వివరాలను తెలుసుకోవడానికి ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారని, ఆ ఉచ్చులో పడొద్దని సూచించారు.

వెంటనే హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సదరు నంబర్‌ను బ్లాక్‌ చేయించారు. నకిలీ ధృవపత్రాలను సమర్పించి నైజీరియాకు చెందిన సైబర్‌ నేరగాళ్ళు ఈ నంబర్‌ తీసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. నకిలీ ఖాతాలు, వాట్సప్‌ డీపీలు, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులకు ఎట్టి పరిస్థితులలో స్పందించొద్దని ఉన్నతాధికారులు కోరుతున్నారు. గతంలోనూ కొంత మంది సైబర్‌ నేరస్థులు అదనపు డీజీ స్వాతిలక్రా, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement