ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్ళు మాత్రం ఓ అడుగు ముందుకు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల పేరుతోనే కాకుండా ప్రముఖుల పేర్లను కూడా ఈ సైబర్ నేరగాళ్లు వాడేస్తున్నారు. ఏకంగా ఈ సారి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కూడా ఈ మాయగాళ్ళు వదల్లేదు. ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచారు సైబర్ నేరగాళ్లు. ఆయన ఫోటో పెట్టి అధికారిక ఖాతా అంటూ చూపించారు.
అంతేకాకుండా కొన్ని ట్వీట్లు కూడా పోస్ట్ చేశారు. అది చూసిన కొంతమంది పోలీసులు దానిని అనుసరించారు. దీనిని గుర్తించిన డిజిపి కార్యాలయం వెంటనే నిలిపివేసింది. డిజిపి పేరుతో ఖాతా ను ఓపెన్ చేసి మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేశారు. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.