Monday, November 18, 2024

గిఫ్ట్ పేరుతో మహిళ నుంచి 16 లక్షల మోసం..

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. అదనుచూసి ఒక్కొక్కరికి గాళం వేసి..ఎరగా బహుమతులను ఆశ చూపి మరి డబ్బులు గుంజుతున్నారు. హైదరాబాద్ బోయిన్ పల్లికి చెందిన ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని అందుకుగాను వివిధ చార్జీల పేరుతో ఏకంగా 16 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. ఇక హైదరాబాద్ గోల్కొండ కు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు విలువైన కార్ గెలిచారంటూ కాల్ చేసిన సైబర్ చీటర్స్. కార్ కావాలా, క్యాష్ కావాలా అని అడగటంతో నగదు కావాలని చెప్పాడు బాధితుడు. ట్రాన్స్ఫర్ చేయాలంటే వివిధ చార్జీలు కట్టాలని..ఆన్లైన్ ద్వారా 17.35 లక్షలు కాజేశారు చీటర్స్. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో కేసులో ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు తెప్పింస్తామని ఆశ చూపి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ట్రేడింగ్ అధిక లాభాలు చూపిస్తామని ఇద్దరు వ్యక్తుల నుంచి 3.7 లక్షల మోసం చేశారు సైబర్ దొంగలు.

ఇది కూడా చదవండి: గుంటూరులో పొలిటికల్ హీట్.. నారా లోకేష్ అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement