Tuesday, November 26, 2024

Cyber Crimes: లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు..

సైబర్ క్రైమ్ కేటుగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. వరుసగా అమాయక ప్రజలను వలపన్ని దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఐదు లక్షల పైగా కాజేశారు. పాతబస్తీ బడా బజార్ కి చెందిన ముంతాజ్ బేగం కు ఇటీవల ఓ గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. ఇటీవల మీరు చేసిన షాపింగ్ లో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నెంబర్ కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని, ముందుగా లాటరీ గిఫ్ట్ టాక్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు. తాము ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా మనీ, 5 లక్షల 25000 ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. వారి మాటలు నమ్మిన ముంతాజ్ బేగం వారు అడిగిన మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత కాల్ వచ్చిన నెంబర్ కు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది మోసపోయానని గ్రహించిన ముంతాజ్ సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Cyber Crime: కేవైసీ అప్డేట్ పేరుతో ట్రాప్..5 లక్షలు సుక్తా

Advertisement

తాజా వార్తలు

Advertisement