Thursday, November 21, 2024

Cyber Crime – ఆ ఆటో డ్రైవర్ లే – రూ.175 కోట్లు కొట్టేశారు

రూ.175 కోట్లు దోచేశారు!- పేదల పేరిట ఆరు ఖాతాలు- రెండేళ్లలో భారీగా లావాదేవీలు- హవాలా మార్గంలో మళ్లింపు- షంషీర్‌గంజ్‌ ఎస్‌బీఐలో బాగోతం- అధికారుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు- ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగరంలో ఎస్‌బీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను సైబర్ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులిద్దరూ… ఆరుగురు పేరిట నకిలీ బ్యాంక్‌ ఖాతాలు తెరిచి రూ.175 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఆరు ఖాతాల్లో నగదు లావాదేవీలపై అనుమానంతో బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా నకిలీ ఖాతాల్లో అనతికాలంలోనే భారీగా లావాదేవీలు జరిగినట్లు- సైబర్‌ -కై-మ్‌ పోలీసులు గుర్తించారు. నిందితులు పేదల పేరుతో ఖాతాలు తెరిచి సైబర్‌ నేరాలకు పాల్పడ్డారని, వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు- పోలీసుల విచారణలో తేలింది. నిందితులు నగదును క్రిఎ్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌, కాంబోడియా తదితర దేశాలకు తరలించినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

ఇటీవకాలంలో హైదరాబాద్‌లోనూ సైబర్‌-కై-మ్‌ నేరాలు పెరిగిపోవడంతో సైబర్‌ -కై-మ్‌ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ ముఠాల కోసం వేట మొదలుపెట్టిన సైబర్‌ -కై-మ్‌ పోలీసులు ఎస్‌బీఐలో నకిలీ ఖాతాల గుట్టరట్టు- చేశారు.

- Advertisement -

సైబర్‌ ముఠాలకు అకౌంట్స్‌ సప్లయ్‌ చేస్తున్న వారితో పాటు- అకౌంట్‌ హోల్డర్లలను విచారించి డబ్బు రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇలా వెలుగులోకి.

పాతబస్తీ షమ్‌షీర్‌గంజ్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఆరు ఖాతాలలో రూ.175 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదులందాయి. ఇద్దరు అటోడ్రైవర్లకు చెందిన ఈ రెండు ఖాతాల ద్వారా రెండు నెలల స్వల్ప వ్యవధిలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు- గుర్తించారు. ఖాతాదారులు సైబర్‌ మోసాలకు పాల్పడి గుర్తించారు. ఈ ఖాతాలకు ఉన్న లింక్‌లపై విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్నట్లు- సైబర్‌ పోలీసులు గుర్తించారు.

అతనికి చెందిన ఐదుగురు సహచరులు పేద ప్రజలను బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, సైబర్‌ నేరాలు, హవాలా కార్యకలాపాలకు కమీషన్‌ ప్రాతిపదికన ఉపయోగించుకున్నట్లు- పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయడంలో షోయిబ్‌ కీలక పాత్ర పోషించినట్లు- సైబర్‌ -కై-మ్‌ పోలీసులు నిర్ధారించారు.

ఖాతాలు తెరిచిన తర్వాత, చెక్కులపై ఖాతాదారుల సంతకాలు చేయించి తన సహచరులలో ఒకరి కస్టడీలో ఉంచినట్లు తేలింది. కాగా ఇందులో కొంత డబ్బును క్రిఎ్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌కి పంపించారని, ఈకేసులో ప్రధాన నిందితుడి ఆదేశాలను అనుసరించి సహచరులు డబ్బును విత్‌డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హవాలా మార్గంలో…

పాతబస్తీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్‌లు వారి బ్యాంక్‌ అకౌంట్స్‌ నుంచి హవాల మార్గంలో దుబాయ్‌కి డబ్బుని ట్రాన్స్‌ఫéర్‌ చేశారు. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్‌లలో డిపాజిట్‌ చేశారు. ఆటోడ్రైవర్లతో పాటు మరో నలుగురి వెరసి ఆరు బ్యాంక్‌ అకౌంట్‌లకు 600 కంపెనీలతో లింకు ఉన్నట్లు- సైబర్‌ -కై-మ్‌ బ్యూరో అధికారులు గుర్తించారు. క్రిఎ్టో కరెన్సీ ద్వారా డబ్బుని విదేశాలకు పంపారని, అలాగే కొంత డబ్బును హవాలా ద్వారా దుబాయ్‌, కంబోడియా దేశాలకు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

కేవలం కమిషన్‌ మొత్తాలకు ఆశపడే

హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఆరుగురు అకౌంట్లు- తెరిచారు. రూ.175 కోట్ల ఈ భారీ స్కాంపై సైబర్‌ సెక్యూరిటీ- బ్యూరో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతోంది.కమీషన్‌ ఒప్పందంఈ కేసులో కీలక నిందితుడు షోయిబ్‌తోపాటు- ఇతర సహచరులు కొంతమంది పేదలతో ఈ ఏడాది ఫిబ్రవరి నగరంలోని షమ్‌షీర్‌గంజ్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఆరు కరెంట్‌ ఖాతాలను తెరిచారు. పథకం ప్రకారం నిరుపేదలను ఎంచుకుని వారి పేరిట బ్యాంక్‌ ఖాతాలను తెరిచేందుకు ఒప్పించి వారికి కమీషన్‌ ఆశ చూపించారు.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో ఈ ఆరు ఖాతాలలో రూ.175 కోట్లు- లావాదేవీలు జరిపినట్లు బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్‌ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే సైబర్‌ నేరగాల కోసం పనిచేసిన మహ్మద్‌ షాహిబ్‌, బిన్‌ హమాద్‌లను సైబర్‌ సెక్యూరిటీ- బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కమిషన్‌ వస్తుందని వేరొకరి కోసం బ్యాంకు ఖాతా తెరవవద్దని, అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలను తెరిచి వేరొకరికి వాటిని అప్పగించడం నేరం కిందకు వస్తుండని, మోసగాళ్లు ఇచ్చే కమిషన్‌ కోసం నేరస్థులుగా మారొద్దని హితవు పలుకుతున్నారు. బ్యాంక్‌ ఖాతా దారుల సైతం వారి ఖాతా కార్యకలాపాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని పోలీసులు సూచిస్తున్నారు.

పెరిగిన -టె-క్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీ-వల సైబర్‌ క్రిమినల్స్‌ మోసాలకు పాల్పడుతున్నారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఓటీ-పీ, లింక్‌ల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement