హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రష్మికా మందన్నా వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ వీడియోను సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నారు. గతేడాది నవంబర్ 2023లో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరాపటేల్ వీడియోకి రష్మికా ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement