Saturday, November 23, 2024

ఉద్యోగం ఇప్పిస్తానని 2.5 లక్షల మోసం

ఉద్యోగం పేరుతో రెండున్నర లక్షల రూపాయలు మోసపోయిన ఘటన పుణేలో జరిగింది. రష్యాకు చెందిన ప్రిన్స్ రోన‌క్ కొటెచ అనే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో త‌న‌కు త‌న భార్య‌తో పాటు బావ‌మ‌రిదికి ఉద్యోగాలు వ‌చ్చేలా స‌హ‌క‌రిస్తాన‌ని మ‌భ్య‌పెట్టాడ‌ని బాధిత టెకీ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. త‌మ‌ను ఫోన్ ద్వారా ఇంట‌ర్వ్యూలు చేశార‌ని, ఆపై ఉద్యోగ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఈమెయిల్స్ ద్వారా పంపార‌ని తెలిపాడు. కంపెనీ అధికారుల‌కు తాను డ‌బ్బు చెల్లించాల‌ని నిందితుడు కోర‌గా అత‌డి ఖాతాకు రూ 2.5 ల‌క్ష‌లు బదిలీ చేశామ‌ని చెప్పాడు. ఆపై నిందితుడు డ‌బ్బు కోసం మ‌ళ్లీ డిమాండ్ చేయ‌డంతో అనుమానం వ‌చ్చిన టెకీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సీబీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని నిందితుడు మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌ను మోస‌గించిన‌ట్టు త‌మ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా జులై 10 వ‌ర‌కూ జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించార‌ని చెప్పారు.

ఇది కూడా చదవండి: యూపీలో కప్పా వేరియంట్ కలకలం..

Advertisement

తాజా వార్తలు

Advertisement