అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఏదోఒక చోట సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఫోన్ చేస్తారు.. సార్ బ్యాంకు నుంచి అంటారు.. మీ నెంబర్ కి ఓటీపీ అంటారు.. చెప్పగానే ఖాతాలో డబ్బులు ఖాలీ చేస్తారు.. మనం ఏమిటి అని ఆలోచించే లోపే ఈ తతంగం అంతా జరిగిపోతుంది. తాజాగా మెదక్ జిల్లాలో సైబర్ మోసం చోటుచేసుకుంది. ప్రగతి ధర్మారంకు చెందిన బీహార్ కార్మికుడికి కాల్ వచ్చింది. సార్ మీకు కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పాడు.. దీంతో ఆ యువకుడు ఒకే అన్నాడు.. సార్ మీ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని మీరు చెప్పండి.. మీకు సర్టిఫికెట్ కన్ఫమ్ అవుతుందని చెప్పాడు. దీంతో ఆ యువకుడు ఆలోచించకుండా ఓటీపీ చెప్పాడు. సెకండ్ల వ్యవధిలోనే ఖాతా నుంచి రూ.1.5 లక్షలు మాయమయ్యాయి. దీంతో యువకుడు సైబర్ వలలో చిక్కినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా సైబర్ నేరాలు జరక్కుండా పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ పలు చోట్ల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికీ మీ ఓటీపీని తెలపవద్దని పోలీసులు హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement