Tuesday, November 26, 2024

Cyber Crime: క‌రెంట్ బిల్ క‌ట్టాల‌ని లింక్.. క్లిక్ చేశాడు.. బుక్క‌య్యాడు..

సైబర్ నేరాలపై ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు జాగ్రత్తపడటం లేదు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అకౌంట్లోని డబ్బు మొత్తం పోగొట్టుకుంటున్నారు. తరచూ మన మొబైల్ ఫోన్‌లకు చిత్రవిచిత్ర సందేశాలొస్తుంటాయి. ముఖ్యంగా ఈ లింక్ క్లిక్ చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. క‌రెంట్ బిల్లు క‌ట్టాల‌ని, గ్యాస్ బిల్లు, ఆధార్ కార్డు గురించి ఒక లింగ్ ఇలా సైబ‌ర్ నేర‌గాళ్లు మ‌నం ఆ లింక్ ఓపెన్ చేశాదాకా పంపిస్తూనే ఉంటారు. పొరపాటున వాటిని క్లిక్ చేశారో మీరు బుక్కైనట్టే ఇక. ఇలా లింకులు పంపిస్తూ వాటి ద్వారా మీ ఖాతాల్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా కామారెడ్డి జిల్లాలో క‌రెంట్ బిల్ పేరుతో సైబ‌ర్ మోసం జ‌రిగింది. క‌రెంట్ బిల్లు క‌ట్టాల‌ని చీట‌ర్లు లింక్ పంపించారు. బాధితుడు క‌రెంట్ బిల్లు క‌డ‌దామ‌ని ఆ లింక్ ఓపెన్ చేయ‌డంతో ఒక్క‌సారిగా రూ.49 వేలు మాయం అని మెసేజ్ వ‌చ్చింది. ఖాతా చెక్ చేయ‌గా న‌గ‌దు నిల్. ఏం జ‌రిగిందో తెలియ‌క అయోమ‌యానికి గురైన బాధితుడు రాజేశ్వ‌ర్ రావు వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించి జ‌రిగిన విష‌యం తెలిపారు. సైబ‌ర్ మోసం జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. దీనికి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement