Saturday, November 23, 2024

Cyber Crime: కేవైసీ అప్డేట్ పేరుతో ట్రాప్..5 లక్షలు సుక్తా

సైబర్ క్రైమ్ నేరగాళ్లు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. వాళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు. కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షలకు పైగా కాజేశారు. హైదరాబాద్ లోని డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ నుంచి కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని నమ్మించి బుట్టలో పడేసారు.

సిమ్ కార్డు ఆన్ లైన్ ద్వారా అప్డేట్ చేయాలంటే వెంటనే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు. మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని క్లిక్ చేసి కార్డు వివరాలు నమోదు చేయాలని అలాగే బ్యాంక్ డెబిట్ కార్డు నెంబరు తదితర వివరాలు నమోదు చేయాలని సూచించాడు. అతడి మాటలు నమ్మిన సత్యనారాయణ వివరాలు చేయడంతోపాటు మొబైల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ లు కూడా చెప్పేశారు. ఆ వెంటనే తన ఖాతా నుండి ఐదు లక్షల ముప్పై వేలు డెబిట్ అయ్యాయి. తర్వాత కాల్ వచ్చిన నెంబర్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చదవండి: అన్ని సినిమాలు కలిపినా రూ.10వేలు కలెక్షన్ రాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement