వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయం పాలైంది. 285 పరుగుల లక్ష ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 40.3 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యింది. ఈ క్రమంలో ఆప్గానిస్తాన్ జట్టు 69 పరుగులతో గెలిచి తమ ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 66 పరుగులు-7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా. డేవిడ్ మలాన్ (32), ఆదిల్ రషీద్ (20) పరుగులు చేసి పర్వాలేదనిపంచారు. వీరు తప్ప మిగిలినవారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్ రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు తీయగా.. ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఇక్రమ్ అలీఖిల్ (58; 66 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఇబ్రహీం జద్రాన్ (28), ముజీబ్ ఉర్ రహ్మాన్ (28), రషీద్ ఖాన్ (23) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. లివింగ్ స్టోన్, రూట్, టాఫ్లీలు తలా ఓ వికెట్ తీశారు.