బెంగళూరు: ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళిని పంచింది. తొలుత శ్రేయస్ (128 ), రాహుల్ (102), రోహిత్ (61), గిల్ (51), కోహ్లీ (51) సీమ టపాకాయల్లా పేలగా.. టీమ్‌ఇండియా 410 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్లు ఆఖరివరకూ పోరాడి 250 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బౌలర్లతోపాటు టీమ్‌ఇండియా బ్యాటర్లు సైతం బౌలింగ్ వేసి అలరించారు. కోహ్లీ, రోహిత్ ఏకంగా ఒక్కో వికెట్ తీశారు.బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు.
కాగా, నెదర్లాండ్ జట్టులో మ్యాక్స్ 30, కొలిన్ 35, సింబ్రాండ్ 45, తెలుగు కుర్రాడు తేజ 54 పరుగులు చేశారు..ఇక 411 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్ బెంగళూరు పిచ్ చిన్నదే గాక బ్యాటింగ్‌కు అనుకూలించేది కావడంతో డచ్ బ్యాటర్లు కూడా అంత ఈజీగావికెట్ పారేసుకోవడం లేదు. మన ఫాస్ట్ బౌలర్ల త్రయాన్ని సమర్ధవంతగా ఎదుర్కొవడంతో దీంతో రోహిత్.. పార్ట్ టైమర్లను బంతినిచ్చాడు. భారత అభిమానులు ఎప్పుడూ చూడని విధంగా శుభ్‌మన్ గిల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా తలా రెండు ఓవర్లు విసిరారు. గిల్ రెండు ఓవర్లలో 11 పరుగులివ్వగా.. సూర్య 17 పరుగులిచ్చాడు. వీళ్లంతా బౌలింగ్ చేయడంతో బెంగళూరు క్రౌడ్.. రోహిత్ కూడా బౌలింగ్ చేయాలని అరవడం గమనార్హం. అంతకుముందు వీళ్లే కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలని నినాదాలు చేయడంతో రోహిత్.. విరాట్‌కు బంతినిచ్చాడు. దీంతో తొమ్మిదేళ్లే విరామ తర్వాత కోహ్లి బౌలింగ్ లో వికెట్ తీసుకున్నాడు.. ఇక స్కిపర్ రోహిత్ కూడా అయిదు బాల్స్ వేయగా చివరి వికెట్ అతడికే దక్కింది.. ఇక ఈ టోర్నిలో తొమ్మిది మ్యాచ్ లోనూ టీమ్ ఇండియా విజయాలు సాధించింది.. టేబుల్ టాప్ లో నిలిచింది.. 15వ తేదిన జరిగే తొలి సెమీస్ లో గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిల్యాండ్ తలపడనుంది..