Saturday, November 23, 2024

Elections | అక్ర‌మార్కులలో ద‌డపుట్టిస్తున్న cVIGIL..

సార్వత్రిక ఎన్నికల (2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్రమాలు, నిబంధనలు ఉల్లంఘించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే దురుద్దేశంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయే అక్రమార్కులుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రత్యేకంగా ‘సి విజిల్’ యాప్‌ను రూపొందించింది. ఇందులో పౌరులు కూడా భాగస్వాములు కావచ్చు. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ‘సి విజిల్‌’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో.. నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడే వారిని.. ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డు చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుంటారు. ఫిర్యాదుపై 100 నిమిషాల్లో విచారణ జరిపి నిర్దిష్ట చర్యలు తీసుకోనున్నారు. దీనిని ఏ పౌరుడైనా ఉపయోగించవచ్చు. పార్టీలకు అతీతంగా అవినీతికి పాల్పడే వారు ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement