బిల్లులు కట్టకపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలివేస్తూ కనెక్షన్ కట్ చేశారు. లక్ష రూపాయలకు పైగా బిల్లులు బకాయి ఉన్న వినియోగదారులను హెచ్చరించి, బకాయిలు చెల్లించని పక్షంలో కరెంట్ కనెక్షన్లు కట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా బరేలీలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం గత ఐదునెలలుగా బిల్లులు చెల్లించట్లేదు. ప్రభుత్వం పేర్కొన్న లక్ష పరిమితి కన్నా అదనంగా బిల్లులు బకాయి ఉండటంతో ముందస్తు నోటీసులు ఇచ్చారు. మొత్తం రూ. 1.15 లక్షలు బకాయి ఉండటంతో కనెక్షన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..